12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ పరిధిలో శుక్రవారం తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు ఎనిమిది మంది ఎరచ్రందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారినుంచి 12 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ కంట్రోల్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ పి.నరేష్ బృందం స్థానిక ఎఫ్‌బీఓ అంజనా స్వాతితో కలసి గురువారం అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్ద కొంతమంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. టాస్క్‌ఫోర్స్ బృందం వారిని సమీపించడంతో వారు పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 12 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎరచ్రందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారిని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్‌జే శ్రీనివాస్ విచారించారు. అనంతరం సీఐ ఖాదర్ బాషా ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, వేలూరు జిల్లాకు చెందిన పి.లక్ష్మణన్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.ఆరు లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది కథనం మేరకు.. 2016 సంవత్సరంలో తిరుమల, తుంబర తీర్థం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు లక్ష్మణన్ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. లక్ష్మణన్‌పై నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


