తిరుపతి జిల్లా అర్చకుల నూతన జేఏసీ అధ్యక్షుడిగా ఎన్.వంశ
ఏర్పేడు: తిరుపతి జిల్లాలోని దేవాదాయ, ధర్మా దా యశాఖ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, భజంత్రీల సిబ్బంది జేఏసీ జిల్లా నూతన అధ్యక్షుడిగా గుడిమల్లం పరశురామేశ్వరాలయ అర్చకులు ఎన్.వంశీకృష్ణశర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాపానాయుడుపేటలోని శ్రీ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో జిల్లా జేఏసీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఆకుల సతీష్ (భారతీయ మజ్దూర్ సంఘ అధ్యక్షులు) అధ్యక్షుడిగా యన్. వంశీకృష్ణ శర్మ (అర్చకులు, పరుశురామేశ్వర స్వామి దేవస్థానం, గుడిమల్లం), ఉపాధ్యక్షుడిగా టి.మణి(సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, పాకాల), ప్రధానకార్యదర్శిగా కే.ప్రకాష్, సంయుక్త కార్యదర్శిగా వి.ఢిల్లీ (పూజారి, ఆంజనేయపురం), కార్యనిర్వాహక కార్యదర్శిగా శివకుమార్ శర్మ (కనుపూరు ముత్యాలమ్మ గుడి), కోశాధికారిగా బాలాజీ (బుగ్గమఠం, తిరుపతి) ఎన్నికయ్యారు. అలాగే ఈసీ సభ్యులుగా సేతు కుమార్(పల్లి కొండేశ్వర స్వామి ఆలయం), లోకేష్ (దేశమ్మ గుడి, తిరుపతి), లలిత (గుడి మల్లం దేవస్థానం), మధు (గుడిమల్లం దేవస్థానం) పి.మణి (పాకాల సుబ్రహ్మణ్యస్వామి గుడి) జి.ఎస్ వరప్రసాద్ (అర్చకులు, ముత్యాలమ్మ గుడి, కనుపూరు), ఏ .సురేంద్ర (ముత్యాలమ్మ గుడి, కనుపూరు), పి .బాలాజీ (పోలేరమ్మ గుడి, నాయుడుపేట), సీ హెచ్ సోమశేఖర శర్మ( నాయుడుపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


