నేడు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
తిరుమల : టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించనున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై చర్చించనున్నుట్ల తెలిసింది. పదిరోజులకు ఏవిధంగా టికెట్లు, టోకెన్లు జారీచేయాలనే విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు.
తీరంలో అలజడి
వాకాడు : అల్పపీడనం నేపథ్యంలో సముద్రం తీరం అల్లకల్లోలంగా మారింది. భీకర శబ్దాలతో అలలు 10 మీటర్ల ఎత్తున ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు సైతం భారీగా తగ్గిపోయాయి. చలితీవ్రత ఒక్కసారిగా పెరగిపోయింది. కార్తీక మాసంలో సముద్రస్నానానికి వచ్చిన భక్తులు తీరంలో అలజడిని గమనించి వెనుదిరిగారు.


