అక్రమంగా అనుమతులు
ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారంటూ ఇసుక తోడేళ్లు కొన్ని పత్రాలను చూపించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలంలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేకపోయినప్పటికీ, రెవెన్యూ అధికారులు అక్రమంగా అనుమతులు ఇవ్వడంపై మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఇసుక రవాణా చేయాలి, ఎంత కావాలి..ఏ ప్రాంతం నుంచి ఇసుకను తరలించాలి..రాత్రుల్లో ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తున్నారా..లేదా..? విషయాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా అనుమతులు ఇవ్వడం ఏమింటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ శివరామసుబ్బయ్యను వివరణ కోరేందుకు యత్నించగా..ఆయన స్పందించలేదు.
రెడ్డివారిపల్ల్లె సమీపంలోని స్వర్ణముఖినదిలో ఇసుక తవ్వకం


