నృత్యం..మంత్రముగ్ధం
చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో శ్రీనటరాజ అకాడమీ చిన్నారుల భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు యగనశ్రీ, పర్ణశ్రీ, జశ్వంత్, సౌజన్య, జ్వాలిత, లలన్‌రాజ్, జినిషా, శ్రీనిధి తమ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
మధురం..సంకీర్తనల గానం
తిరుపతి కల్చరల్: అన్నమాచార్యుల కై వల్య సిద్ధి పొందిన బహుళ ద్వాదశి తిథి సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సా యంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనల కచేరి శ్రోతలను ఓలలాడించింది. డాక్టర్ కే. సుబ్రమణ్యం బహుళ ప్రచారంలోనున్న పలు అన్నమయ్య సంకీర్తలను సుమధురంగా గానం చేసి ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్‌పై జి.ఉదయ్‌కుమా ర్, తబలాపై జి.శోభనాద్రి, శృతి రిథమ్స్‌పై జి.శ్రీనివాసులు సహకారం అందించారు.
నృత్యం..మంత్రముగ్ధం


