మరింత బలోపేతమే లక్ష్యం
తిరుపతి మంగళం:తిరుపతి నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్‌సీపీని మరింత బలో పేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షు డు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక రైల్వే కాలనీలోని పార్టీ కార్యాలయంలో 34, 35, 44వ వార్డుల నేతలతో వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకరంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ, అలాగే వార్డు కమిటీ నియామకాలను త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. అక్రమ కేసులకు వెనుకంజ వేయకుండా సమష్టిగా ప్రజల పక్షాన పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షు డు మల్లం రవిచంద్రారెడ్డి, నేతలు పోలిరెడ్డి నాగిరెడ్డి, దినేష్‌రాయల్, అశోక్‌కుమార్‌రె డ్డి, పుల్లయ్య, నాధముని, యోగాంజనేయులు, ధీపక్,గౌతమ్,ముస్తఫా పాల్గొన్నారు.


