రూ.కోట్లు కొట్టేసేందుకే ప్రైవేటీకరణ
చిల్లకూరు : పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో వైద్యకళాశాలలను నెలకొల్పితే, రూ.కోట్లు కొట్టేసేందుకే చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం గూడూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. అన్ని రంగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి సొమ్ము చేసుకునేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నైజం తెలిసే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలకు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు ఊటుకూరు యామిని, జగనన్న సేవా సమితి అధ్యక్షుడు ఊటుకూరు మహేంద్రరెడ్డి, నేతలు బత్తిన విజయకుమార్, దువ్వూరు శేషురెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, చెంచురాఘవరెడ్డి, నందవరం సుబ్బారావు పాల్గొన్నారు.


