ప్రభుత్వాస్పత్రుల్లో వెట్టి చాకిరీ!
రేణిగుంట : ప్రభుత్వాస్పత్రుల్లో నర్సులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రేణిగుంట పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చక్రపాణిరెడ్డితో మాట్లాడారు. మహిళ స్టాప్ నర్సులకు లీవులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల కొరత ఏర్పడిందన్నారు. ఏడుగురు పనిచేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నర్సుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నర్సుల డ్యూటీ సమయాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు అమలు చేయాలని సూచించారు.


