ఐసర్‌లో ‘ఇండియన్ అకాడమీ’ సదస్సు
ఏర్పేడు : శాస్త్ర, వైద్య రంగాల్లో భారతావనిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే పరిశోధనలు జరగాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు. బెంగుళూరులో సర్ సీవీ రామన్ స్థాపించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 91వ వార్షిక సదస్సును శుక్రవారం ఏర్పేడు మండలం జంగాలపల్లె సమీపంలోని తిరుపతి ఐసర్ కొలీజియం(ఆడిటోరియం)లో అట్టహాసంగా ప్రారంభించారు. వరదరాజన్ మాట్లాడుతూ ఎన్‌హాన్సింగ్ ది స్టెబిలిటీ అండ్ ఎఫిఫియెన్సీ ఆఫ్ వైరల్ వ్యాక్సిన్స్ అనే అంశంపై పలువురు శాస్త్రవేత్తల సందేహాలను నివృత్తి చేశారు. హెచ్‌ఐవీ టీకాలు, ఔషధ పురోగతిని వివరించారు. కోవిడ్–19 వ్యాక్సిన్, పరిణామాలపై పలువురి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరిశోధనల స్టాల్‌లో సందడి
సదస్సుకు వచ్చిన పలువురు విద్యార్థులు, శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధలకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తిగా చదివారు. అలాగే వివిధ ఆవిష్కరణల ఫలితాలను విద్యార్థులకు వివరించారు. సదస్సులో ఏఎన్‌ఆర్‌ఎఫ్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్, బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ విజయ్ చంద్రు, ఎన్‌ఏఆర్‌ఎల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్‌కుమార్ పట్రా, తిరుపతి ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు, ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ, అకడమిక్ డీన్ సుదీప్తా దత్తా పాల్గొన్నారు.
ఐసర్‌లో ‘ఇండియన్ అకాడమీ’ సదస్సు
ఐసర్‌లో ‘ఇండియన్ అకాడమీ’ సదస్సు


