వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ కమిటీ ఎంపిక
తిరుమల : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో సింగపూర్ హోంమంత్రి షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతి రావు, రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టెంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టిక్కెట్లు లేని వారికి 12గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది.


