107 రైల్వేగేటుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

107 రైల్వేగేటుకు మోక్షం

Nov 14 2025 5:51 AM | Updated on Nov 14 2025 5:51 AM

107 ర

107 రైల్వేగేటుకు మోక్షం

● అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద యాక్సెస్‌ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం ● ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట మార్గంలోని రైల్వే గేటు నంబర్‌ 107కు మోక్షం లభించింది. ఈ మార్గంలో నిర్మిస్తున్న అండర్‌ బ్రిడ్జి వద్ద అదనంగా ఎడమ వైపునకు (రేణిగుంట వైపు) యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వేశాఖ నుంచి ఆమోదం లభించింది. తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్‌ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్‌ బ్రిడ్జ్‌కు పాత హీరోహోండా షోరూమ్‌ వద్ద రైల్వేగేట్‌ నంబరు 107 వైపు మాత్రమే యాక్సెస్‌ ఉండడంతో భవిష్యత్తులో వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎంపీ గురుమూర్తి గ్రహించారు. ఈ నేపథ్యంలో కాటన్‌మిల్‌ వద్ద ఉన్న రైల్వేగేట్‌ నంబర్‌ 108 వైపుగా అదనపు యాక్సెస్‌ రోడ్డు అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవకు లేఖ రాశారు. ఎంపీ ప్రతిపాదనపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలించిన అనంతరం యాక్సెస్‌ రోడ్డు ఏర్పాటు సాధ్యమేనని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుంచి మంగళం, లీలామహల్‌ సర్కిల్‌ వైపునకు వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

107 రైల్వేగేటుకు మోక్షం 1
1/1

107 రైల్వేగేటుకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement