పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు!
చిట్టమూరు: రాజకీయంగా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో సాగు చేసుకునే సొంత భూమిలోకి కూడా దిగనివ్వకుండా అడ్డుకుంటున్నారని వళ్లీపురం గ్రామానికి చెందిన పంట్రంగం రామసుబ్బయ్య గురువారం ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ మండలంలోని మల్లాం రెవెన్యూలో తనకు 1.40 సెంట్లు భూమి ఉందన్నారు. ఈ భూమికి పక్కనే మరొక రైతుకు పట్టా భూమి ఉందన్నారు. ఆ రైతు లీజుకు ఇవ్వగా వారు భూమి చుట్టూ కంచె నాటి తన పొలంలోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారన్నాడు. పొలం దుక్కి దున్నుకునేందుకు ట్రాక్టర్ వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోవడంతో నాటిన కంచెను తొలగించాలని కోరితే తన పట్టా భూమిలోకి దిగేందుకు వీలు లేదన్నారు. పక్కనే ఉన్న దేవాదాయ శాఖ భూమిలో నుంచైనా వెళదామంటే లీజుకు తీసుకున్న వారు కూడా కంచె నాటేయడంతో ఇప్పటికే పొలంలో వేసిన నారుమడి ముదిరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయ గా, విచారణ నిమిత్తం తహసీల్దార్ నరేష్ భూమి వద్దకు వచ్చి పరిశీలించి, కంచె నాటిన వ్యక్తి పట్టా భూ మి కావడంతో తామేమి చేయలేమని వెళ్లారన్నారు. రాజకీయ కక్షలతో పట్టా భూమంటూ ఎవరికి వారు ఫెన్షింగ్‌లు, కంచె నాటుకుంటే అవతలి పొలాల్లోకి రైతులు ఎలా వెళ్లగలరని ప్రశ్నించాడు. అయితే పట్టా భూమిలో ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉందని, దానిని సర్వే చేయమని రెవెన్యూ అధికారులను కోరగా పట్టించుకోవడం లేదని రైతు ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్‌ను వి వరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. అయితే తన ది పట్టా భూమి అని, తాను తన పొలంలో నుంచి పోనివ్వనని సమాధానం చెప్పాడన్నారు. రాజకీయ రంగు పులుముకోవడంతో తామేమి చేయలేకపోతున్నామన్నారు.


