164 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు
తిరుపతి అర్బన్: జిల్లాలో 164 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 1200 మంది ఓటర్లుకు మించి ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బీఎల్వోలు చేసిన సర్వే మేరకు జిల్లాలో 1200 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కొత్తగా 164 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38 పోలింగ్ కేంద్రాల ప్రాంతాల మార్పునకు, 9 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు, 44 పోలింగ్ కేంద్రాలు విలీనం చేయడానికి ప్రతిపాదనలు పంపినటు్‌ల్ స్పష్టం చేశారు. ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ వస్తే 21,41గా ఉన్న పోలింగ్ కేంద్రాలు 2,261కి చేరతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.


