ఆంక్షలపై అసహనం
తిరుపతి కల్చరల్ : తిరుపతిలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని పుణ్యస్నానాలు, దీపారాధనలతో భక్తులు పులకిస్తుంటారు. అయితే టీటీడీ అధికారులు కుంటి సాకులతో భక్తులను ఆలయంలోని పుష్కరిణిలోకి అనుమతించకుండా.. దీపారాధనలు చేయనీయకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పుష్కరిణి చుట్టూ కంచె వేశారని భక్తుల మండిపడుతున్నారు. అలాగే, అయ్యప్పమాలధారులు స్నానమాచరించే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.
అయ్యప్ప భక్తుల ఆందోళన
రెండ్రోజులుగా అయ్యప్ప భక్తులను కపిలతీర్థం పుష్కరిణిలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. టీటీడీ అధికారులు విధించిన ఆంక్షలపై అసహనం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు. టీటీడీ ఈఓ డౌన్ డౌన్, టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పుణ్యస్నానాలకు ఎస్పీ అనుమతించినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అత్యుత్సాహం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అరగంట మాత్రమే అయ్యప్ప భక్తులను పుష్కరిణిలోకి అనుమతించారు.
ఆందోళనకు దిగిన
అయ్యప్ప భక్తులు


