చీటింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
నాయుడుపేటటౌన్ : పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని, కార్లను తక్కువ ధరకే అందిస్తామని పలువురిని రూ.లక్షలు మోసం చేసిన ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ బాబీ తెలిపారు. వివరాలు.. బాలాయపల్లెకు చెందిన కొమ్మురు గురుప్రసాద్ అలియాస్ ప్రసాద్‌రెడ్డి, ఓజిలి మండలం కుందాం గ్రామానికి చెందిన శిల్పా ప్రియాంక ఏపీఆర్‌డీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. నాయుడుపేట మండలం అన్నమేడుకు చెందిన దొనపార్తి సాధన అనే మహిళను తమ సంస్థలో ఏజెంటుగా నియమించుకున్నారు. తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కాజేశారు. ఇదే విధంగా పలువురికి ఇళ్లు కట్టిస్తామని, కార్లు ఇప్పిస్తామని మోసం చేసినట్లు తెలియడంతో బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్థానిక విద్యుత్ కార్యాలయం సమీపంలోని నిందితుల నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివిధ పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, ప్రామిసరీ నోట్లు, అనేక స్టాంపులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులన కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బాబీ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
బీజేపీలో మహిళలకు ప్రాధాన్యం
తిరుపతి గాంధీ రోడ్డు:భారతీయ జనతా పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బుధవారం ఓ ప్రైవేటు అతిథి గృహంలో పార్టీ సమావేశం నిర్వహించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిషీధా రాజు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం తర్వాత జాతీయ స్థాయిలో మహిళా మోర్చా మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నిషిధారాజు కుటుంబం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నేతలు సామంచి శ్రీనివాస్, గోపీనాథ్‌రెడ్డి, కోలా ఆనంద్, దస్తగిరిరెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
చీటింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్


