భక్తులకు మెరుగైన ప్రసారాలే లక్ష్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మెరుగైన ప్రసారాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఎస్వీబీసీ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేలా, పాలన పారదర్శకంగా ఉండేలా, వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మానవ వనరులు, ఆర్థిక వ్యవహారాలు, ఉత్పత్తి, సరఫరా, నిల్వలు తదితర విభాగాల అంశాలను ఒకే స సాఫ్ట్ వేర్ వ్యవస్థలో సమన్వయం చేసేందుకు సమగ్ర ప్రణాళికా వ్యవస్థను తీసుకురావాలన్నారు. ఎస్వీబీసీలో ఆర్థిక అంశాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేకంగా అకౌంట్స్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. ఎస్వీబీసీ ఇన్‌చార్జి ఈసీఓ డి.ఫణికుమార్ నాయుడు, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ ఓ. బాలాజీ పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ : అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని కాటూరు ఎస్సీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు(50) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాపిల్లలతో విడి పోయి దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నా డు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి వచ్చి గ్యాస్ స్టవ్‌పై వంట చేసుకుని, గ్యాస్ ఆపకుండా సిమ్‌లో పెట్టి నిద్రపోయాడు. గ్యాస్ లీకై ఇళ్లంతా వ్యాపించింది. రాత్రి విద్యుత్ పోవడంతో కొవ్వొత్తి వెలిగించారు. దీంతో ప్రమాదం జరిగింది. పక్కంటివారు హుటాహుటిన కోటేశ్వరరావును తిరుపతిలోని రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మరణించినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.


