మా ఆవేదన తగులుతుంది
నీట్–2025లో మా అబ్బాయికి 469 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ కన్వీనర్ కోటాలో సీటు దక్కలేదు. జగనన్న ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలలు ప్రైవేటు చేతికి వెళ్లకపోయుంటే మా అబ్బాయికి తప్పకుండా సీటు వచ్చేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. లేకుంటే మా తల్లిదండ్రుల ఆవేదన తప్పక తగులుతుంది.
– కోమలాదేవి,
విద్యార్థి తల్లి, తిరుపతి
వైద్యుల సంఖ్య తగ్గితే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడంతో వైద్యుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీంతో వైద్యం సైతం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమవుతుంది. గత వైఎస్సార్‌సీపీ సర్కారు రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకే పెద్దపీట వేస్తోంది. – పరంధామరెడ్డి,
విశ్రాంత వైద్యాధికారి, తిరుపతి
మా ఆవేదన తగులుతుంది


