మూడు చక్రాల వాహనాలకు..
తిరుపతి అర్బన్: విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల వాహనం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు విక్రమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 10 మందికి మాత్రమే ఇస్తామని చెప్పారు. దళారులను నమ్మకుండా డబ్లూడబ్యూడబ్యూ.ఏపీడీఏఎస్‌సీఏసీ.ఏపీ.జీవో.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి 18–45ఏళ్ల లోపు వయస్సు కలిగిన 70శాతం వైకల్యం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారుడు గతంలో ఎటువంటి వాహనాలు పొంది ఉండకూడదన్నారు. దరఖాస్తుదారులపై సొంత వాహనాలు ఉండకూడదని, ఎవరి సహాయం లేకుండా నడవలేని వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.
దివ్యాంగులకు వైకల్యం శాతంపై టెన్షన్
జిల్లాలో 7600 మందికి వైకల్యం తగ్గడంతోనే పింఛన్లు తొలగిస్తున్నట్లు సచివాలతయ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. దీంతో దివ్యాంగులు పెద్ద ఎత్తున న్యాయం కోసం రోడ్డెక్కారు. ఈ క్రమంలో దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పింఛన్లు ఇవ్వాలని సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మరోసారి వైకల్యం పరీక్షలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైకల్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30శాతం మందికి మాత్రమే పరీక్షలు చేసి, 20 శాతం మందికి కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. మిగిలిన 70శాతం మందికి వైకల్యం పరీక్షలు చేయడానికి మరో రెండు నెలలు సమయం పట్టేలా ఉంది.
పాత సర్టిఫికెట్లు, కొత్త సర్టిఫికెట్లు ఏదీ తీసుకోవడం లేదు..
రాష్ట్రంలో 5.80 లక్షల మంది దివ్యాంగులుంటే చంద్రబాబు పాలనలో ఈ ఏడాది ఆగస్టులో ఇచ్చిన వైకల్యం శాతం ప్రకారం 1.30 లక్షల మందికి మాత్రమే 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉంది. మిగిలిన 4.50 లక్షల మందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండేలా ఇచ్చారు. తిరిగి న్యాయం కోసం పోరాటాలు చేస్తే మళ్లీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.50 లక్షల మందికి పరీక్షలు చేశారు. అందులో లక్ష మందికి మాత్రమే కొత్త సర్టిఫికెట్లు వచ్చాయి. మిగిలిన 1.50 లక్షల మందికి కొత్త సర్టిఫికెట్లు రాలేదు. మరోవైపు 3.30 మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. ఇంకోవైపు అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి పాత, కొత్త సర్టిఫికెట్లు ఏవైనా సిస్టమ్ తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గానికి 10మందిని ఏలా ఎంపిక చేశారో తెలియడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు ఇవ్వకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరుతున్నాం. –చంద్రశేఖర్, దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్
మూడు చక్రాల వాహనాలకు..


