శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
వాహన సేవల వివరాలు
ఈనెల 17 నుంచి 25 వరకు జరగనున్న శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25 వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.


