చాకచక్యంగా విద్యుత్ మరమ్మతు పనులు
నారాయణవనం:ఆరు అడుగుల లోతున్న చెరువు మధ్యలో విద్యుత్ స్తంభంపై విరిగిన పిన్ ఇన్సులేటర్‌ను విద్యుత్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించి మంగళవారం మార్పు చేసి, అందరి మన్ననలు పొందారు. వివరాల్లోకి వెళితే.. సముదాయం సబ్‌స్టేషన్ నుంచి వెత్తలతడుకు చెరువు మీదుగా హెచ్‌టీ లైన్ వెలుతోంది. చెరువు మధ్యలో స్తంభంపై పిన్ ఇన్సులేటర్ విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. సమస్యను గుర్తించిన లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, జేఎల్‌ఎం ఏఎల్‌ఎం అమర్‌నాథ్, ఆంజనేయులతో క్షేత్ర పరిశీలనతో సుమారు ఆరు అడుగుల లోతున్న చెరువు మధ్యలో పిన్ ఇన్సులేటర్లు విరిగిపోవడం గుర్తించారు. లారీ ట్యూబ్‌పై కుర్చున్న గురునాథ్‌ను ఆంజనేయులు తీసుకువెళ్లి పిన్ ఇన్‌సులేటర్లను మార్చి, విద్యుత్ ప్రసా రాన్ని పునరుద్ధరించారు. అమర్‌నాథ్, ఆంజనేయులను సిబ్బందితో పాటు పలువురు ప్రశంసించారు.
చాకచక్యంగా విద్యుత్ మరమ్మతు పనులు


