హత్య కేసులో ముగ్గురి అరెస్టు
రేణిగుంట: మండలంలోని లక్ష్మీనగర్‌లోని వైన్‌షాపు సమీపంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. సోమవారం గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవి మనోహరాచారి ఈ కేసు వివరాలను వెల్లడించారు. క్లూస్ టీమ్ సహకారంతో మృతదేహం వేలిముద్రలు సేకరించి పరిశీలించగా, మృతుడు కొండూరు మనోజ్ అని నిర్ధారణ అయ్యింది. దర్యాప్తులో ముఖ్యమైన ఆధారాలు లభించాయి. కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రధాన నిందితుడు హరిప్రసాద్ సుధాకర్, శ్యామ్సన్ సహాయంతో హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.


