సైదాపురం: మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిద్ధలయ్యకోనలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మూడో కార్తీక సోమవారం సందర్భంగా జరిగే తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మహిళలు దీపారాధన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


