పెయ్యల తిప్ప ఆక్రమణల తొలగింపు
కలువాయి(సైదాపురం): కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 733లో ఉన్న 10 ఎకరాల పెయ్యల తిప్పను కొందరు స్థానికులు, నాయకులు సాయంతో ఆక్రమించారు. పేదలకు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రధాన రహదారికి తిప్ప దగ్గరగా ఉండడంతో కొందరు నాయకులు సాయంతో ఆక్రమణ దారులు పెట్రేగిపోతున్నారు. ఈ విషయమై స్థానికులు ఇన్‌చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయగా సోమవారం వీఆర్వో జనార్దన్ జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
తిరుపతి రూరల్: పేరూరు పంచాయతీ విద్యానగర్ కాలనీలో నివాసముంటున్న అనసూయ సోమవారం కార్తీక మాసం కావడంతో పక్కింట్లో జరిగే పూజకు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ సమయంలో ఆమె గట్టిగా అవరడంతో ఆమె కుమారుడు ఇంటి మేడపై నుంచి రోడ్డువైపు చూడగా అప్పటికే బైక్‌పై వేగంగా దూసుకుపోతున్న ఆ ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ఎదురుగా వచ్చేవారెవరూ సాహసించలేదు. దీంతో వారు పారిపోయారు. చోరీకి గురైన మహిళ మెడలోని 50 గ్రాముల బంగారం గొలుసు విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు చెబుతోంది. బాధితురాలు అనసూయ కుమారుడు దుద్దుకూరు కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేశారు.
పెయ్యల తిప్ప ఆక్రమణల తొలగింపు


