జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
– షూటింగ్‌లో కాంస్య పతకం
చిల్లకూరు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో రైఫిల్ షూటింగ్‌లో ఓ బాలిక తన ప్రతిభను చాటి బ్రాంజ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. గూడూరు పట్టణంలోని దూర్జటి నగర్‌లో నివాసం ఉండే లక్ష్మీప్రసన్న స్థానికంగా ఉండే ప్రవేటు కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో బాలిక స్థానికంగా ఉండే అకాడమీలో కోచ్ జయశంకర్ ఆధ్వర్యంలో షూటింగ్‌లో శిక్షణ పొందింది. ఈ క్రమంలో స్కూల్ గేమ్స్ సమాఖ్య ద్వారా జరుగుతున్న క్రీడా పోటీలలో ఆమె పాల్గొని మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ఒంగోలులో జరిగిన జాతీయ స్థాయి ఎంపికల్లో పాల్గొన్న బాలిక ముగ్గురితో పోటీ పడి బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో ఆమె త్వరలో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. జాతీయ స్థాయికి బాలిక ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.


