మతిస్థిమితం లేని యువకుడు తండ్రి చెంతకు
రేణిగుంట : చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసరాజు కుమారుడు జగదీష్ మతిస్థిమితం కోల్పోయి గత నెల 21న తప్పిపోయాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్న అతడిని గుర్తించిన హైకోర్టు అడ్వకేట్ పేరూరు మునిరెడ్డి సమాచారం ఇవ్వడంతో రేణిగుంట సర్పంచ్ నగేషం అభయ క్షేత్రంలో ఆశ్రయం కల్పించారు. అభయ క్షేత్రంలో చేర్పించిన వార్త వివిధ పత్రికల్లో రావడంతో నరసరాజు రేణిగుంటకు చేరుకున్నారు. శనివారం సర్పంచ్ సమక్షంలో అభయ క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా బేగం మతిస్థిమితం లేని యువకుడిని తండ్రికి అప్పగించారు. తన బిడ్డను ఆదుకున్న అందరికీ యువకుడు తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.


