అదృశ్యమైన విద్యార్థి అప్పగింత
చిల్లకూరు:మండల కేంద్రమైన చిల్లకూరులోని గురుకు ల బాలుర కళాశాల నుంచి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి హరినాథ్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు ఇలా..రాపూరు మండలం అక్రమాంబపు రం గ్రామానికి చెందిన దాసరి హరినాథ్ చిల్లకూరు గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. శనివారం ఉదయం కళాశాల నుంచి అదృశ్యమయ్యాడు. దీనిని గుర్తించిన వార్డెన్ వెంటనే ప్రిన్సిపల్‌కు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యార్థి చైన్నె వైపు వెళ్లే రైలు కోసం గూడూ రు రైల్వే స్టేషన్‌లో వేచి ఉండడంతో అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి అతడి తండ్రికి అప్పగించారు.


