● ప్రతిధ్వనించిన వందేమాతరం
తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ‘‘వందే మాతరం’’ 150వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు భోదనేతర సిబ్బంది అందరూ వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వర్శిటీ వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ.. 1875లో రచించిన వందేమాతరం గేయంభారత దేశంలో దేశ భక్తి పెంచేలా చేసిందన్నారు. వందేమాతరం గేయం ప్రతి భారతీయుడు చిరస్మరణీయంగా గుర్తు పెట్టుకునే గీతమని, ఆ గేయాన్ని గుండెల నిండా నింపుకోవాలన్నారు. భారతీయ సంప్రదాయం , చేనేత సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వర్సిటీలో ప్రతి నెల 7వ తేదీన చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి రావాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రజని, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.
రేణిగుంట : వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంలో వేడుకలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్ డి. భూమి నాథన్, అధికారులు, సీఐఎస్‌ఎఫ్, జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
● ప్రతిధ్వనించిన వందేమాతరం


