
చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడం ఏమిటని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.