
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపితే పత్రికలపై ప్రభుత్వం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి. విచారణ పేరుతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో గంటల తరబడి పోలీసులు హల్‌చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే ఖండిచాలి తప్ప ఇలాి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. – కల్లుపల్లి సురేందర్‌రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి