
2026 డిసెంబర్‌కు పనులు పూర్తి
చిల్లకూరు: గ్రీన్‌ఫీల్డ్ రహదారుల పనులు నాలుగు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకునివచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిల్లకూరు మండలంలో శరవేగంగా జరుగుతున్న సాగరమాల,(గ్రీన్‌ఫీల్డ్)రహదారి పనులను ఆయన 35 కి.మీ. మేర పరిశీలించారు. అలాగే చిల్లకూరు, కోట మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న క్రిస్ సిటీలో అభివృద్ధి పనులను పరిశీలించి, తీర ప్రాంతంలోనే ఏర్పాటు కానున్న సోలార్ ప్లాంట్ వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగరమాల నిర్మాణ సంస్థ ప్రతినిధులు, క్రిస్ సిటీ ప్రతినిధులతో వేర్వేరు సమీక్ష నిర్వహించి, వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే పను లు నాలుగు ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయన్నా రు. ఇందులో ఒకటి నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు, ఒకటి అంతర్గత రహదారి ప్రాజెక్టు, మరొకటి వరగలి క్రాస్ రోడ్డు నుంచి కృష్ణపట్నం వర కు, నాలుగోది నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వరకు మొత్తంగా 125 కి.మీ. మేర రహదారు ల నిర్మాణం జరుగుతుందన్నారు. వీటిలో మూడు ప్రా జెక్టు పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నాయుడుపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న రహదారి పనులు 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు రూ.3 వేల కోట్లతో చేపడుతున్న ర హదారుల నిర్మాణ పనులు పూర్తయితే, తీర ప్రాంతం సుందరంగా ఉంటుందని తెలిపారు. చిల్లకూరు, కోట మండలాల మధ్యలో ఏర్పాటు అవుతున్న క్రిస్ సిటీకి సంబంధించి తొలివిడతగా 2,500 ఎకరాల్లో ప నులు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను రూ.1200 కో ట్లు వెచ్చించనుండగా ప్రస్తుతం రూ.200తో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఆయన వెంట గూడూరు ఎఫ్‌ఏసీ ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నేషనల్ హైవే పీడీ నెల్లూరు చౌదరి, జిల్లా మైనింగ్ అదికారి బాలాజీ నాయక్, చిల్లకూరు, కోట తహసీల్దార్లు శ్రీనివాసులు, జేజే రావు ఉన్నారు.

2026 డిసెంబర్‌కు పనులు పూర్తి