
బైకును ఢీకొన్న టిప్పర్
● నాగలాపురం మండల సర్వేయర్ సునీత మృతి ● గ్రామ సర్వేయర్ దినేష్‌కు స్వల్పగాయాలు
నాగలాపురం: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ డీకొన్న ఘటనలో మండల సర్వేయర్ సునీత మృతి చెందగా గ్రామ సర్వేయర్ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని బైటకొడియంబేడులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. నాగలాపురం మండలంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సునీత, గ్రామ సర్వేయర్ దినేష్‌తో కలిసి సురుటుపల్లిలో సర్వే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో బైటకొడియంబేడు హైవేపై తిరుపతి వైపు వెళుతున్న ఓ టిప్పర్ బైకును ఓవర్‌టైక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెనుక కూర్చొని ఉన్న మండల సర్వేయర్ సునీత టిప్పర్ చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న దినేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేటు అంబులెన్స్‌లో మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన దినేష్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనింగ్ ఎస్‌ఐ ప్రసాద్, ఏఎస్‌ఐ షణ్ముగం తెలిపారు.

బైకును ఢీకొన్న టిప్పర్