
సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపును సద్వినియోగం చేసుకోండి
తిరుపతి మంగళం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా రవాణాశాఖాఽధికారి కొర్రపాటి మురళీమోహన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన్‌కుమార్‌రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రమణా నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయ ప్రశాంతి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.