
కొత్త టీచర్లకు సర్వీసు రిజిస్టర్లు పంపిణీ
తిరుపతి సిటీ: డీఎస్సీ–2025లో టీచరు పోస్టులు సాధించిన వారు మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరారు. వారికి యూటీఎఫ్ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు స్వాగతం పలికి సర్వీసు రిజిస్టర్లు, సేవా పుస్తకాలను అందజేసి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బండి మధుసూదన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పరంజ్యోతి, నగరపాలక అధ్యక్షులు వై.హేమాద్రి, ప్రధాన కార్యదర్శి ఎస్.ఖాదర్‌బాషా, కోశాధికారి ప్రభుకుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు వరలక్ష్మి, సుధ, ఢిల్లీ ప్రసా ద్, మహాలక్ష్మి, పెద్ద రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.