
ఇద్దరు చిన్నారులను రక్షించిన పోలీసులు
పాకాల : ఇద్దరు చిన్నారులను పాకాల పోలీసులు రక్షించారు. వివరాలు.. రైల్వే స్టేషన్‌లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రైల్వే పోలీసులు పాకాల పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు చిన్నారులను పట్టుకుని రక్షించారు. వారు సత్యసాయి జిల్లా, చెన్నెకొత్తపల్లి మండలానికి చెందిన మోహన్‌రాజ్ కుమారుడు కుమ్మరవరుణ్(12), సురేంద్ర(సూరి) కుమారుడు సి.తరుణ్(11)గా గుర్తించారు. ఈ నెల 11న ఇంటి నుంచి తప్పిపోయినట్టు తల్లిదండ్రులు చెన్నె కోత్తపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాకాల పోలీసులు చెన్నె కొత్తపల్లి పోలీసులకు వివరాలు అందించారు. అనంతరం పాకాల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న చెన్నేకొత్తపల్లి పోలీసులకు చిన్నారులను అప్పగించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాకాల పోలీసులను అభినందించారు.