
తిరుమలలో తనిఖీలు
తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.
పిడుగుపాటుకు
30 మేకలు మృతి
ఓజిలి: పిడుగుపాటుకు 30 మేకలు మృతి చెందిన ఘటన ఓజిలి మండలం, భువనగిరిపాళెం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన తురక గురవమ్మ 60 మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు మేత కోసం మేకలు తోలుకుని అడవీ ప్రాంతానికి తరలించాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. గాలి విపరీతంగా వీయడంతో 28 మేకలు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాయి. మిగిలిన మేకలను తోలుకుని శ్రీనివాసులు ఇంటికి చేరుకున్నాడు. గాలీవాన నిలిచే సమయానికి రాత్రి కావడంతో మేకలు ఇంటికి రాలేదు. ఉదయం సమీపంలో బంధువులతో కలిసి వెదికాడు. పిడుగుపాటుకు గురై చెట్టు కిందనే 28 మేకలు మృత్యువాతపడ్డాయి. అలాగే గ్రామానికి చెందిన కొండూరు రవీంద్రరాజు, ముచ్చకాయల చంద్రమోహన్‌కు చెందిన మేకలు చెరొకటి మృతిచెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారుగా రూ.3.5 లక్షలు వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వీఆర్‌ఏ ఘటనా స్థలిని పరిశీలించారు. తహసీల్దార్‌పద్మావతికి నివేదిక పద్మావతికి నివేదిక అందించారు.
రోడ్డు ప్రమాదంలో
బాలుడికి గాయాలు
తిరుపతి క్రైమ్: తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ద్విచక్ర వాహనం కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రామకిషోర్ కథనం.. చౌడేపల్లి మండలం, శెట్టిపేటకు చెందిన శరత్‌బాబు జీవనోపాధి నిమిత్తం కారు డ్రైర్‌గా కుటుంబంతో కలిసి తిరుపతి క్రాంతినగర్‌లో నివాసముంటున్నాడు. అతని కుమారుడు కె.రిత్విక్ (9) ఓ ప్రయివేటు స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 7.40 గంటలకు రిత్విక్ ఇంటి ముందర రోడ్డుపై సైకిల్ తొక్కుతున్నాడు. సదరు స్కూల్ నుంచి జీవకో న రోడ్డు వైపు అతివేగంగా వచ్చిన రాయల్ ఎన్‌ఫిల్డ్ బైక్ ( AP39 C9049) ఢీకొట్టింది. బాలుడి తలకు, ముఖానికి, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. విచారణలో బైక్ నడిపింది తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన కే.సంతోష్గా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకిషోర్ తెలిపారు.

తిరుమలలో తనిఖీలు