
కమిషనర్‌తో ఎస్‌పీఏ బృందం
తిరుపతి తుడా: తిరుపతిలో జోనింగ్ నిబంధనలు – శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల 28న స్థానిక కచ్చపి ఆడిటోరియంలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం (ఎస్‌పీఏ) కమిషనర్‌ను కలిసి మంగళవారం వివరించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో ‘‘ఎనర్జీ ఎఫిషెన్సీ కన్సిడరేషన్స్ ఇన్ జోనింగ్ రెగ్యులేషన్స్ – ఎ స్టడీ ఆఫ్ తిరుపతి’’ అనే ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా ఎస్‌పీఏ బృందం ప్రధానంగా భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్‌వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసి కమిషనర్‌కు వివరించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్, డిప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు.