
బాధిత కుటుంబాలకు చేయూత
తిరుపతి క్రైం: విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ సుబ్బరాయుడు బాసటగా నిలిచారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విదులు నిర్వహిస్తూ గత నెల 12న అనారోగ్యంతో మరణించిన టీఎల్. వెంకటరత్నం సతీమణి టీ.ఉషాదేవికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వాహణలో సేవలందించి ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీస్ శాఖ ఎప్పటికీ మరిచిపోదన్నారు. వీరి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంలో సంబంధిత శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందిని చెప్పారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వర పాల్గొన్నారు.
ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి స్పష్టం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మ్యాంగో మార్కెట్ యార్డు సమీపంలోని గరుడ వారధి వద్ద ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు ఓ పుష్పాన్ని అందించారు. హెల్మెట్– ప్రాణ రక్షక కవచం అంటూ నినాదాలు చేశారు. గరుడ వారధిపై గరిష్ట వేగ పరిమితి 30 కి.మీ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు సంజీవ్‌కుమార్, సుబ్బరామిరెడ్డి, ఎస్‌ఐలు బాలాజీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.