
ఆకట్టుకున్న ‘మంత్ర’
చంద్రగిరి : ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోహన మంత్ర–2025 మహోత్సవం మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబియు)లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, వారి మేధస్సును, వెలికితతీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చిన ప్రతి విద్యార్థిని అతిథులుగా భావించి వారికి తగిన సౌకర్యాలు కల్పించామన్నారు.
సందడి చేసిన మోహన్ బాబు
మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్‌బాబు సందడి చేశారు. యూనివర్శిటీలో నిర్వహిస్తున్న వివిధ ఈవెంట్‌లను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. అనంతరం కొన్ని చోట్ల ఆయన విద్యార్థులతో పాటు ఆయన ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. అదే విధంగా ప్రో ఛాన్సలర్ విష్ణు విద్యార్థులతో డ్యాన్సులతో జత కలసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చారు.
ఉత్సాహంగా ఈవెంట్స్
కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టెక్నోహాలిక్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఎంబెడెడ్ వర్క్‌షాప్, కోడ్ స్రింట్, లైఫ్ సేవర్ వర్క్‌షాప్, ఈవీ వర్క్‌షాప్, టెక్ ఎక్స్–ప్రోటోటైప్, ఈవీ ఈక్స్‌పో, క్యూజోనోమిక్స్‌లు ఆకట్టుకున్నాయి. కళాక్షేత్ర, స్పోర్ట్స్ ఈవెంట్‌లో భాగంగా లెట్స్ నాచో, చికెన్ డిన్నర్(పబ్జీ), కరోకే కెచప్, పుష్ ఆప్ ఛాలెంజ్– ఎం ప్రాజా ఈవెంట్లు విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్రీ ఫైర్, గల్లీ క్రికెట్, మిక్స్‌డ్ బాస్కెట్ బాల్, ట్రెజర్ హంట్, లక్కీ డ్రా, ఫన్ గేమ్స్, ఫుడ్ ఛాలెంజ్, జార్బింగి బాల్స్ వంటి ఈవెంట్లు ఆకట్టుకున్నాయి.
అదరగొట్టిన డ్రమ్స్ శివమణి డీజే
మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ విద్యానికేతన్‌లో మైదానంలో నిర్వహించి డీజే కార్యక్రమం అదరగొట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ వాయిద్యకారుడు డ్రమ్స్ శివమణి తన సంగీతంతో విద్యార్థులను అలరించారు.

ఆకట్టుకున్న ‘మంత్ర’