
తల్లికి వందనం పథకం ఇప్పించండి
నా పేరు నాగమణి, మాది తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ. అయితే తల్లికి వందనం పథకానికి అర్హులమైనా మాకు పథకం రాలేదు. మా బిడ్డకు తల్లికి వందనం మూడో దశలో అయినా ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మేము పేద కుటుంబం. మాకు న్యాయం చేయండి. – నాగమణి, తిరుపతి
దివ్యాంగుల పింఛన్ ఇప్పించండి
నా పేరు కేజీ సుబ్రమణ్యం, మాది నారాయణవనం. దివ్యాంగుల పింఛన్ పొందడానికి నాకు అర్హత ఉంది. బోదకాలు కావడంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నా. మాది పేద కుటుంబం. అధికారులు మా పేదరికాన్ని గుర్తించి పింఛన్ ఇప్పించాలి
– కేజీ సుబ్రమణ్యం, నారాయణవనం

తల్లికి వందనం పథకం ఇప్పించండి