
కోర్టు ఆర్డర్లను బూచిగా చూపి..
తమకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని చెబుతూ ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. రెవె న్యూ అధికారులు సైతం వారికి కోర్టు ఆర్డర్లు ఉన్నా యని తాము వెళ్తే కోర్టు ఉల్లంఘన కింద తమపై చర్యలు తీసుకుంటారని దాటవేత ధోరణి ప్రదర్శించారు. అయితే సోమవారం సాక్షి ప్రతినిధులు ఆక్ర మణ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో రెవెన్యూ అధికారులు ఉలిక్కిపడి రాత్రి సమయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కూల్చేందుకు సిద్ధమవుతున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు ఆర్డర్లను బూచిగా చూపి..