
సమస్యల పరిష్కారంతోనే బలోపేతం
తిరుపతి రూరల్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోనే యూనియన్ బలోపేతమవుతుందని జనశక్తి విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు తోకల అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఎస్‌జీఎస్ కళాశాల వద్ద ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్ అతిథిగృహంలో యూనియర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టు, రెగ్యులర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జనశక్తి విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలబడుతుందన్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడు అళహరి సుధాకర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. ముఖ్య సలహాదారు టి.సాయి సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో నేతలు ఎస్.పవన్ కుమార్, ఇరివిశెట్టి వెంకటాద్రి, శ్రీరామ్ మల్లికార్జున, పి.సోమశేఖర్, కేవీ ప్రసాద్, వి.మునిరామకృష్ణ, జి.రమేష్ బాబు, బంగారు వెంకటేష్, రామానాయుడు, ధర్మేంద్ర, పీజీ రాజు, బి.కిరణ్, ఎం.భానుచంద్ర పాల్గొన్నారు.