
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
చిల్లకూరు: గూడూరు మండలం చెన్నూరు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వానదారుడికి తీవ్రగాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం మేరకు తిప్పవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి చెన్నూరుకు వచ్చి పని ముగించుకుని ఇంటికి తిరిగి బయల్దేరారు. గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద ఎదురుగా ఢీ కొనడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు అతనిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమంగా విక్రయిస్తున్న బాణసంచా సీజ్
నాగలాపురం : స్థానిక బ్రాహ్మణవీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఈ మేరకు ఎస్‌ఐ సునీల్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి రూ.లక్ష విలువైన బాణసంచా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా అమ్ముతున్న ఇక్బాల్(65)పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా బాణసంచా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడితో కానిస్టేబుళ్లు సాయికిరణ్, భూపతి, కృష్ణ, దివాకర్ పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు