
నీడలో వాహనాలు.. ఎండలో భక్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల తీరు మారలేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ల కింద వాహనాలు పార్కింగ్ చేస్తుంటే పట్టించుకోవడం లేదు. దీంతో భక్తులు ఎండలో రోడ్లపై నడవాల్సి వస్తోంది. రూ.లక్షల వ్యయంతో షెడ్లు ఏర్పాటు చేస్తే, అందులో వాహనాలు పార్క్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అప్పటికీ ఎవరైనా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కారు పార్కింగ్ కాంట్రాక్టర్లు సైతం చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.