
కక్ష సాధిస్తే.. ఉధృత ఉద్యమం
తిరుపతి తుడా : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు పీహెచ్‌సీ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి సేవలందించామని గుర్తు చేశారు. గ్రామీణులకు విశేషంగా వైద్యం అందిస్తున్న తమను వేధించడం సరికాదని మండిపడ్డారు. చిత్తశుద్ధితో విధులు నిర్వరిస్తున్న తమకు మరిన్ని వసతులు, అలవెన్సులు కల్పించకుండా, ఉన్న వాటిపై కోత పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీ వైద్యుల ఆందోళనకు రుయా మెడికల్ ఆఫీసర్లు మద్దతు ప్రకటించారు.