
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సచ్చిదానందమూర్తి
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్‌చార్జిగా ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తిని నియమిస్తూ వీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేసిన డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సాంబశివమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం సచిదానందమూర్తికి అభినందనలు తెలిపారు.
నౌకా మరమ్మతు కేంద్రానికి భూ పరిశీలన
వాకాడు : మండలంలోని తూపిలిపాళెం వద్ద సముద్ర తీరంలో నిర్మించనున్న షిప్ బిల్డింగ్ రిపేర్ సెంటర్‌కు అవసరమైన భూములను బుధవారం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్, కేంద్ర బృందం, పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ మాట్లాడుతూ మ్యాప్‌ల ఆధారంగా భూముల వివరాలను తెలిపారు. నౌకా మరమ్మతు కేంద్రానికి తూపిలిపాళెం తీరం అనువైన ప్రదేశంగా కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.
సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు స్విమ్స్ జట్టు
తిరుపతి తుడా: కర్ణాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈనెల 4 నుంచి 7వ తేదీవరకు నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకు స్విమ్స్ జట్లును బుధవారం ఎంపిక చేశారు. ఎస్.మనోజ్ కుమార్ ఎం.సునీల్ కుమార్, నాగార్జున, శివరంగా, నవీన్ సింగ్, వెంకట గణేష్, ఉదయ్ కుమార్, మల్లిఖార్జున, భరత్ కుమార్ (స్విమ్స్ నర్సింగ్ కాలేజీ), శ్రవణ్ కుమార్, లోకేష్, అమీర్, వెంకటేష్, తేజేశ్వర్ (హెల్త్ సైన్సెస్)కు జట్టులో స్థానం కల్పించారు. పోటీలలో తమ జట్టు విజయం సాధించాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్‌వీ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్.బిట్లా, స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ కేఆర్ శుభాష్, సభ్యులు పి.విశ్వనాథ్‌రెడ్డి, పీడీ బీఏ మధుబాబు కోరారు.
పక్షుల కేంద్రంలో టికెట్ కౌంటర్
దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ప్రవేశ టికెట్లకు బుధవారం కౌంటర్ ప్రారంభించారు. వన్యప్రాణి విభాగం అధికారులు మాట్లాడుతూ వలస విహంగాల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే కేంద్రంలోని మూడు చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో విహంగాలు రాలేదని, ఈ క్రమంలో టికెట్ కౌంటర్ ప్రారంభించి ప్రయోజనం ఏంటని పక్షి ప్రేమికులు అభిప్రాయపడడం గమనార్హం
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుదవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,275 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,973 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సచ్చిదానందమూర్తి

కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సచ్చిదానందమూర్తి

కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సచ్చిదానందమూర్తి