
ఽఏడాది పొడవునా ధరలు పెరగడం లేదు
నిమ్మ వ్యాపారులు ఎగు మతి చేసే ఢిల్లీ మార్కె ట్‌లో ధరలు ఉండడం లేదని ఇక్కడ వ్యాపారు లు ధరలు తగ్గించేస్తున్నా రు. మూడు డిక్కీలు (150 కేజీలు) నిమ్మ కాయలు కోసుకుని మార్కె ట్‌కు వస్తే ఇద్దరు కూలీలకు రూ 600, ఆటో బాడుగ రూ.100, మొత్తంగా ఖర్చు రూ.700 అయ్యింది. వ్యాపారులకు కాయలు విక్రయిస్తే రూ 4,500 లెక్క కట్టారు. దీనికి సుమారు రూ. 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ఉంటే సాగు ఎలా చేయగలం. – వేమయ్య, చిల్లకూరు
కాయలు వదిలేస్తున్నాం
పదెకరాలలో నిమ్మ సాగు చేస్తుండగా ప్రస్తు తం కాపు బాగానే వస్తోంది. అయితే మా ర్కెట్‌లో ధరలు రోజుకొకరకంగా మారిపోతు న్నాయి. ఒక రోజు కిలో రూ.40 అంటారు, మరో రోజు రూ. 30 అంటారు. ఇలా వారంలోనే పలు వ్యత్యాసాలు ఉండడంతో అలాగే వదిలేస్తున్నాం. గతేడాది దసరా మార్కెట్‌లో రూ.60,70 పలికింది. ఇప్పు డు అందులో సగం కూడా లేదు.
– దామోదర్‌రాజు, రాజుల ఎరుగుంటపాళెం,
సైదాపురం మండలం

ఽఏడాది పొడవునా ధరలు పెరగడం లేదు