జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్‌లో స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్: రంజి ట్రోఫి ప్రాబబుల్స్ క్యాంపు, స్టేట్ సీనియర్ ఉమెన్ టీ–20 ప్రిపరేటరీ క్యాంపునకు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్లు స్థానం సాధించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) విడుదల చేసిన రంజీ ట్రోఫీ 2025–26 ప్రాబబుల్స్ క్యాంపునకు బ్యాటింగ్ విభాగంలో అభిషేక్‌రెడ్డి, సీఆర్ జ్ఞానేశ్వర్, బౌలింగ్ విభాగంలో దీపన్ సాయినాథ్ చోటు దక్కించుకున్నారు. అలాగే ఏసీఏ సీనియర్ ఉమెన్స్ టీ–20 రాష్ట్ర ప్రిపరేటరీ క్యాంపునకు ఎం.గ్రీష్మ, ఈ.పద్మజ ఎంపికయ్యారు. వీరు విశాఖపట్నంలో నిర్వహించే జాతీ య స్థాయి టీ–20 మ్యాచ్‌లో మన రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా ఏసీఏ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలో ప్రతిభ చూపుతున్నారని, రానున్న రోజుల్లో ఏపీఎల్, ఐపీఎల్‌లోనూ స్థానం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్‌లో స్థానం

జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్‌లో స్థానం

జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్‌లో స్థానం

జిల్లా క్రికెటర్లకు రంజీ, స్టేట్‌లో స్థానం