
తప్పుడు కేసులతో శునకానందం పొందుతున్నారు!
వెంకటగిరి (సైదాపురం): కూటమి నేతలు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బందులు పెడుతూ శునకానందం పొందుతున్నార ని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో కొందరి ఆస్తులు అక్రమంగా తీసేసుకోవడంతోపాటు వాహనాలపై సైతం అక్రమ కేసులో బానాయిస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టేది లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్‌ను పద్ధతికి శ్రీకారం చు ట్టారని, ఈ మేరకు ఇబ్బందులు పడినా ప్రతి కార్యకర్త ఆ బుక్‌లో వివరాలు నమోదు చేస్తే వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన అనంతరం వారిపై క్రమశిక్షణ చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసుల వ్య వహార శైలి బాగా లేదని విమర్శించారు. టీడీపీ ప్ర భుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వివక్షత చూపుతున్నట్లు ఆరోపించారు.