
ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
తిరుపతి కల్చరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఉద్యోగుల కు 12 నెలల జీతాలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.శ్రీధర్, ఎం. రమేష్ కోరారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం యూనియన్ నాయకుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించి నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం స్పందించి జీతాలు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
రేబిస్ అవగాహన ర్యాలీ
తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం వరల్డ్ రేబిస్ అవేర్‌నెస్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో తిరుపతిలో ర్యాలీ చేశారు. ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. కుక్క కరిచినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి వైద్యులను సంప్రదించాలని, రేబిస్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు మురళీకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, స్వరూప్, లావణ్య, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై
పోరుబాట
తిరుపతి కల్చరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని గంధమనేని శివ య్య భవన్‌లో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సి ల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలులో దూకుడు పెంచిందన్నారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానా న్ని అమలుచేయాలని క్యాబినెట్, అసెంబ్లీలో తీర్మా నం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు ఎన్‌డీ.రవి, శివ, కేవై.రాజా, వైఎస్.మణి, గోవిందస్వామి, కత్తిరవి, మల్లికార్జున, నాగరాజమ్మ, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.