
అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్ ప్రారంభం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పాలనలో పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులకు బలవుతున్నారో, అలాంటి నాయకులకు, కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మన కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్ బుక్ అన్నారు. అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు కోసం రూపొందించినదే ఈ డిజిటల్ బుక్ అంటూ మరోసారి గుర్తు చేశారు. కార్యక్రమంలో తిరుపతి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.